నాకున్నూ నా పిల్లల మధ్య జరిగి నొక సంభాషణ నిక్కడ రాస్తున్నా. చిన్నది టెన్త్ లోను పెద్ద దింటర్లో నున్నప్పటి మాట. వాళ్ళు వాళ్ళ స్కూల్ లోను లేక కాలేజీ లో జరిగిన సంఘటనలు మాతో చెబుతూ వుంటారు. ఒక రోజు చిన్నది వచ్చి , 'నాన్నా, నాకీ మధ్య అబ్బాయిలతో మాటలాడటం ఉత్సుకత గాను, అమ్మాయిలతో మాటలాడడం విసుగ్గాను వుంది. అమ్మాయిలు ప్రతి దానికి ముఖం మాడ్చుకుంటూ వున్నారు. అదే అబ్బాయిలైతే ఉత్సాహంగా సరదాగా ఉంటూ, మాట్లాడడానికి చాలా హాయిగా వున్నారు', అని చెప్పింది. సహజంగా నేను కానీ సుప్రియ కానీ వాళ్ళు ఎమన్నా ఇటువంటివి చెబితే వాళ్ళని ఖండించము. వాళ్ళు వాళ్ళ భావాలని బయట పెట్టనిస్తాం. కాబట్టే వాళ్ళు అన్నీ దాయకుండా చెప్పేస్తారు.
అదే సమయంలో మా పెద్దది ఓ కథతో వచ్చింది. నాన్నా! మా కాలేజీ లో మా సహాధ్యాయిని వాళ్ళ అమ్మ, మా కాపలాదారుడి కొడుకుని కొట్టింది చూడూ అంటూ! ఏమి జరిగిందిరా! అంటే ఈ విధం గ చెప్పుకొచ్చింది. "మా సహాధ్యాయిని ని వాళ్ళ అమ్మే రోజూ తనను కాలేజీ లో దింపేది. అలా దింపడానికి వచ్చినప్పుడల్లా, మా కాపలాదారుడి కొడుకు ఆమెకి నమస్కారం కూడా చెప్పేవాడట. ఈ మధ్య ఆవిడ రావటం లేదు, ఆ అమ్మాయే ఒంటరిగా వచ్చేస్తుంది, కాలేజీకి రావటం మరియు పోవటం అలవాటు పడిపోయింది కనుక. కొన్ని రోజులకి, అమ్మాయి వాళ్ళ అమ్మకి కాలేజీ నుండి ఫోన్ కాల్ వెళ్ళింది, వాళ్ళ అమ్మాయి క్లాస్ కి సరిగా రావటం లేదని. వాళ్ళ అమ్మగారు, కాదు మా అమ్మాయి క్రమం తప్పకుండా వస్తుంది కాలేజీకి అని చెప్పి, వెంటనే వచ్చేసారు కాలేజీ దగ్గరకు. అమ్మాయి గారు కాలేజీ లో లేరు. అమ్మాయి వాళ్ళ నాన్నగారు ఒక డి.ఎస్.పి. ఆయన వెంటనే తన బెటాలియన్ తో రంగంలోకి దిగి, కనిపెట్టారు ఆ అమ్మాయీ, మా కాపలాదారుని కొడుకు పక్కనున్న పార్కు లో తేలి వున్నారని. వాళ్ళ నాన్నగారు వాడినేమీ అనలేదు, కానీ వాళ్ళ అమ్మగారు మాత్రం వాడిని కుమ్మేసింది" అని. పైగా తేలిందేమిటంటే ఆ పిల్ల కూడా వాళ్ళ అమ్మ నెంబర్ మారిందని, బదులుగా తన స్నేహితురాలి నెంబర్ కాలేజీలో ఇచ్చి, ఇన్ని రోజుల గైరు హాజరు మేనేజ్ చేసింది. ఆ పిల్ల ఖర్మకాలి రిసెప్షనిస్ట్ గావేరే ఆమె రావటం, వచ్చినావిడ ఆ అమ్మాయి వాళ్ళ అమ్మగారి పాత నెంబర్ కి ట్రై చేయటంతో అసలు భండారం బయట పడింది.
మేము మా పిల్లల్ని అడిగాము, పైన కథలో మీరు ఏమి గ్రహించారు అని. వాళ్లు తమకలవాటైన శైలిలోనే చెప్పారు, ఆ అమ్మాయిదే తప్పు అని, అలా వాళ్ళ పేరెంట్స్ నమ్మకాన్ని, ఆశల్ని ఆ అమ్మాయి వమ్ము చేసింది అని. మేము అడిగాము మరి చెల్లి కూడా, అబ్బాయిలతో మాటలాడటం చాలా ఉతసాహంగా వుంది అన్నది కదా, మరి ఆ అమ్మాయి చేసినది తప్పు ఎలా అని. ఆ అమ్మాయికి కూడా వాడు చెప్పిన కబుర్లు ఉత్సాహంగానే వున్నాయి కాక పోతే స్కూల్ బదులు పార్క్ అంతే తేడా అని. నాన్నా, మేము ఇలా ఆ అమ్మాయిదే తప్పు అన్నామని మాకు వ్యతిరేకంగా మీరు చెప్తున్నారు, మేము ఆ అమ్మాయే కరెక్ట్ అంటే మీరు ఇంకోలా చెప్పేవాళ్ళు అంటూ నా మీద విరుచుకు పడ్డారు మా మా అమ్మాయిలు.
మాకు అర్థమయ్యింది మేము మా స్టాండ్ చెప్పే సమయం వచ్చిందని. మీలో కొందరికి నచ్చినా నచ్చక పోయిన నేను ఇలా చెప్పా. మొదటిది, మీరు ఒప్పులు చేస్తేనే నేను మీకు అండగా ఉండేదని అనుకోవొద్దు, మీరు తప్పులు చేసి కష్టాల్లో పడ్డా నేను మీకు వున్నా, కాబట్టి నన్ను ఏ సమయం లో నైనా సహాయం కోసం అడగటంలో సంకోచించ వద్దు. నా దృష్టి మీ సమస్యని పరిష్కరించటం మీదనే కానీ మిమ్మల్ని ఎత్తి పొడవటం మీద ఉండదు. ఇంకా సంభాషణను పొడిగిస్తూ, ఈ విధంగా కొంచెం సుత్తి కొట్టాం, ' మీకు ఒకడు నచ్చొచ్చు, వాడు చెప్పే కబుర్లు నచ్చవచ్చు, కానీ కథ అంతటి తో ముగియదు. వాడు కొంత కాలానికి బయటకెళ్దాం అంటాడు. ఒక సినిమా కో, ఒక పార్క్ కో, లేక ఎక్కడైనా ఒంటరి ప్లేస్ కో. మీకు కొన్ని సార్లు వెళ్లాలని అనిపించ వచ్చు. కానీ మీరు అన్నీసార్లు వేళ్ళ లేరు. మీరు వెళ్లలేనప్పుడు వాడు ఎమోషనల్ గా మిమ్మల్ని మానిప్యులేట్ చేస్తాడు. చచ్చినట్టు వెళ్ళాలి, వాడి మాట వినాలి. ఈ ప్రాసెస్ లో మీరు కోల్పోయేది మీకు నచ్చినట్టుండ గలిగే మీ ఫ్రీడమ్. మీకు అవసరమా ఇదంతా. మీకు ఎక్కడికైనా వెళ్లాలంటే తీసుకు వెళ్లే అమ్మా, నాన్న, నాన్నమ్మ మరియు తాతయ్య లాటి ఇందరం వున్నాము. మీ ఎమోషన్స్ వినడానికి, భరించడానికి, ఏమీ ఆశించకుండా చేయడానికి. మీకు మీ ఫ్రీడమ్ కావాలా, లేక ఆ ఫ్రీడమ్ కీని ఏ గొట్టం గాడి చేతిలో పెడతారా' అని .
తర్వాత రోజు వచ్చారు ఇద్దరు, నాన్నా! మాకు మీరు ఇచ్చే ఫ్రీడమ్ కావాలి. మా ఫ్రీడమ్ కీస్ మా చేతుల్లోనే ఉండాలి అంటూ. సరే అమ్మా, ఒక నాన్న! వైపునుండి చూస్తే మీరు నా దగ్గర, రూపం లో గొంగళి పురుగుల్లా, గుణం లో సీతకోక చిలుకల్లా, మీ మీ పెళ్లిళ్లయ్యాక, రూపం లో కూడా సీతాకోక చిలకల్లా
This podcast uses the following third-party services for analysis:
Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp