Artwork for podcast Harshaneeyam
మా నెల్లూరోళ్లు, ఎంతైనా ప్రత్యేకమబ్బా!
29th March 2020 • Harshaneeyam • Harshaneeyam
00:00:00 00:05:25

Share Episode

Shownotes

మా నెల్లూరోళ్లు చాల ప్రత్యేకమబ్బా. ఓర్నీ పాసు గూలా, ఏందిరా! అబ్బయ్యా అంటూ భోళాగా పలకరిచ్చేస్తారు. ఆటో గాని రిక్షా అతను కానీ ఎక్కండి అనరు, బేరం కుదరగానే ఎక్కు అంటారు అలాగే ఎవర్నైనా నువ్వు అంటారే గాని మీరు అనరు. కొంచెం బయట ఊర్ల నుండి వచ్చినోళ్ళకి మా ఏకవచన సంబోధన కొంచెం కష్టమే.

మా వాళ్ళకి నచ్చేది సినిమాలు, భోజనాలు మరియు పాలిటిక్స్. ఒకప్పుడు మాకు అదిరే హాల్స్ ఉండేవి. మూడు హాళ్లు, నర్తకి, అర్చన మొదటి శ్రేణి అయితే, సుందర్ డీలక్స్, రాధామాధవ్, శ్రీనివాస, అనిత, లీలమహల్ లాటి ద్వితీయ శ్రేణి, వినాయక, న్యూటాకీస్, విజయ మహల్, మనీటాకీస్ లాటి తృతీయ శ్రేణి హాల్స్. పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూడాలంటే వినాయక హాల్ మాత్రమే. పేరుకు న్యూ టాకీస్ గాని ఆడేదంతా రెండో రిలీసో లేక మూడో రెలీసో లేక ఎన్ని రిలీస్ లయ్యాయో తెలీని అరిగిపోయిన సినిమాలు.

ఇక భోజనానికి వస్తే, మా ప్రత్యేకాలు చాలానే వున్నాయి. నెల్లూరు చేపల పులుసు అంటే వరల్డు ఫేమస్. మేము పులుసును, గండి, బొచ్చె, బొమ్మిడాయిలు, మట్ట గిడసలు, జెల్లలు మొదలగునవి వాడతాం. అలాగే పులుసులో ఓ మామిడి ముక్క, ఓ వంకాయ ముక్క వేస్తే నా సామిరంగా ఆ రుచే వేరబ్బా. వంకాయ మామిడికాయ బజ్జి, మునక్కాడలులో పాలుపోసి చేసే కూర, పులి బొంగరాలు, మిరపబజ్జీలు, కారందోశలు మా ప్రత్యేకాలు. చిన్నప్పుడు స్వతంత్ర పార్క్ లో ఆడి, సండే మార్కెట్ దగ్గర బజ్జీలు తినటం, ఆ తర్వాత కొంచెం పెద్దయ్యాక రాధా మాధవ్ దగ్గర కారం దోశెలు రుచి చూడటంలో ఆ మజానే వేరు. సంతపేట లో మునిసిపల్ మార్కెట్ కి ఎదురుగా వుండే పరంధామయ్య హోటల్ లో దోశె మరియు పాయా కూర రుచో చూడాల్సిందే.

మంచి గులాబ్ జామూన్ కావాలంటే జై హింద్ స్వీట్స్, మలై కాజాకి మురళి కృష్ణ స్వీట్స్, అరటి బజ్జీలకి రాజా కేఫ్, చాయ్ పే చర్చలకు సీమ కేఫ్ , టెస్ట్ బుక్స్ కి శ్రీరామ్ స్టోర్స్, హోమియోపతి మెడిసిన్కి సదాశివ మెడికల్స్, మంచి ఫొటోస్ దిగాలనుకుంటే ట్రంక్ రోడ్ లో రాజా స్టూడియోస్, అప్పట్లో హీరో పెన్ కావాలంటే పెన్ కార్నర్, కంటి అద్దాలు కావాలంటే డాక్టర్ కృష్ణ , ఐస్క్రీం కి బాబు లేక ఎస్.జి.ఎం, అన్నీ టిఫిన్స్ అల్ టైం ఫేవరెట్ చంద్రభవన్స్ (మూసేసారు), వెజ్ మీల్స్ కి కోమల విలాస్ కి వెళ్లాల్సిందే నబ్బ.

అలాగే చీప్ గా రఫ్ నోట్ బుక్స్ కావాలంటే టౌన్ హాల్ ఎదురు సందులో వికాస్ బుక్స్, సెకండ్ హ్యాండ్ బుక్స్ కి సంతానం అండ్ కో,ఎమన్నా వెనెరియల్ ప్రాబ్లెమ్ లకు ఉమా నర్సింగ్ హోమ్ పక్కన డాక్టర్ మాతుల్లా గారి దగ్గర కు వెళ్లాల్సిందే. నాన్ వెజ్ కి బోసోటా, నర్తకి పక్కన నిర్మల కేఫ్, కిళ్లీ సామానులకి గూండా అంజనేయశెట్టి గారి షాప్, సరుకులకు స్టోన్ హౌస్ పేటలో నాత వారి షాప్ అలాగే పెద్ద బజారులో నాగరాజం స్టోర్స్, మెటల్ సామానులకు కాంతి స్టోర్స్, పండ్లకు నారపనేని వీరాస్వామి అండ్ సన్స్ ఫేమస్ అబ్బా.

ఇక పాలిటిక్స్ కి వద్దాం. అసలు రాజకీయాలు మా బ్లడ్ లోనే వున్నాయబ్బా. కానీ మన నెల్లూరు అన్న వివేకా చని పోయాక ఎంటర్టైన్మెంట్ తెగ మిస్ అవుతున్నాం. నీ పాసుగూల ఏందయ్యా జాఫ్ఫారా! అంటూ తను చేసిన హడావుడి, షాప్ ఓపెనింగ్స్ వెళ్లి చీరలు పైన వేసుకొని చేసే ఆర్బాటం బాగా మిస్సింగ్. ఇక సీమా కేఫ్ దగ్గర పావుగంట నిలబడితే అసలు ఇరాక్, కువైట్ ని ఎందుకక్రమించిందో, అమెరికాకి ఇరాన్ మీద కోపమెందుకో, మైక్ గాటింగ్ ని అవుట్ చేసిన అద్భుతమైన బంతిని షేన్ వార్న్ ఎక్కడ, ఎలా ప్రాక్టీస్ చేసాడో లాటి ప్రశ్నలకు నాకు అక్కడ సమాధానాలు అప్పట్లో దొరికేసాయి. ఈ మధ్య కాలం లో అక్కడ నిలబడలేదు, కాబట్టి ప్రస్తుత అంతర్జాతీయ సమస్యలకు మా నెల్లూరొళ్ల పరిష్కారాలు గురుంచి నాకు తెలియదు. అసలు మా సీమా కేఫ్ ని యూ.ఎన్.ఓ యొక్క రెండో బ్రాంచ్ గా ఎందుకు డిక్లేర్ చేయలేదో నాకైతే అర్థం కాదు. ఆ ప్రపోసల్ ని పాకిస్థాన్, చైనా సహాయంతో తిప్పి కొట్టటంలో సఫలమయ్యిందని మా వాళ్ళ ఉవాచ.

నాకు ఇప్పటికీ నెల్లూరు రైల్వే-ఫీడెర్స్ రోడ్డులో వెళ్తూ అమెరికన్ హాస్పిటల్ ని చూస్తుంటే డాక్టర్ బేరమ్మ ఇంకా అక్కడే ఉందేమో అనిపిస్తుంది. అరవైయ్యవ లేక డెబ్భైయ్యవ శకం లో పుట్టిన నా బోటోళ్లందరూ అక్కడే ఈ లోకాన్ని చూసుంటారు. ఎంత మందికి ఆవిడ, ఈ నాటి శస్త్ర చికిత్సలు అవసరం లేకుండానే పురుడులు పోసుంటారో. ధన్యురాలు ఆ తల్లి. అలాగే పల్లెలనుండి కాన్పులకు వచ్చిన వారందరికీ వసతి కల్పించిన ఆ రేబాల వారి సత్రం, ఆ సత్రం లో గడిపిన అడపా దడపా రోజులు. ఉన్న కొన్ని రోజుల్లోనే ఐకమత్యంగా మెలిగి అక్కడనుండి బాగైపోయి కూడా కళ్ళనీళ్ళతో వెళ్లే వాళ్ళు రోగులు (రోగులనకూడదు వాళ్ళని ఆరోగ్యవంతులనాలి). అట్టి సత్రాలు కట్టి వాటిని నామ

This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Chapters

Video

More from YouTube