ఓడమ్మా భడవా ఐదు నిమిషాల్లో నెల్లూరుని కళ్ళకు కట్టినట్టు విన్పించావు కదరా సామి, అన్నారు మా నెల్లూరోళ్లు వాళ్ళ కథవిని. కొందరైతే నేను ఏమేమి కవర్ చేయలేదో వాటిల్ని అన్నిటిని రాసి పంపించారు, అబ్బయ్య అసలు నీవు ఈటిల్ని ఎట్టా మర్చిపోయినావు అని. సో బాహుబలి పార్ట్ 2 మాదిరి మన నెల్లూరోళ్లు పార్ట్ 2 తయారు చేశా.
మొదలుగా గుర్తు చేసుకోవాల్సింది కమ్యూనిజంకి అసలు సిసలు అర్థం చెప్పి జనాల సేవే, జనార్థన సేవ అనుకొని మనకి సేవలు చేసిన రామచంద్రా రెడ్డి ఆసుపత్రి మన నెల్లూరికే కాదు రాష్ట్రానికే గర్వకారణం.
అట్టానే జమీన్ రైతు, గురించి గూడ చెప్పాల. ప్రపంచంలో ఎక్కడున్నా వారం వారం ఇంటికి తెప్పిచ్చుకోని జమీన్ రైతు చదివేవాళ్ళు, పోస్ట్ లో ఆ వారం మిస్ అయితే అన్నం మానేసే నెల్లూరోళ్లు నాకు తెల్సు. ఇప్పుడంటే ఆన్లైన్ ఎడిషన్ వచ్చిపారేసిందనుకో. మేము వి.ఆర్ కాలేజీకి వచ్చేపాటికి లాయర్ గూడ బాగా పాపులర్ అయ్యింది. ఇంకా ఈ రెండు పేపరోళ్ళు మన సబ్స్క్రిప్షన్ అయ్యిపోయినా ఆపకుండా ఇంటింకి పంపిస్తారు మన ఊరోళ్ళే కదా అని.
వాళ్ళ పేపర్లు నష్టాల్లో వున్నా అట్టా చెయ్యడం వాళ్ళకే చెల్లింది. అట్టా ఉంటాయి మావోళ్ల అభిమానాలు.
మదీనా వాచ్ కంపెనీలో దొరికే హెచ్.ఎం.టి వాచ్ ల గురించి, నెల్లూరులో వీధినపడి రిక్షాలో తిరుగుతూ ఆడ మగ గొంతులు రెండు ఆయనే మాట్లడుతూ, ప్రచారం చేసే మనిషి, నాకు మా చిన్నప్పుడు ఓ ప్రపంచ వింత.
ఆలాగే నేను పాంటు కుట్టించుకోవటం, నా ఇంటర్మీడియట్ లో సంతపేట లోని సుధా టైలర్స్ తో మొదలుపెట్టా, కొంచెం స్టైల్ పెరిగాక, వెంకట్ రామ అండ్ కో కి - అర్చన రెండో గేట్ కి మజ్జలో వుండే, కాపిటల్ టైలర్స్ కి మార్చా.
ఇంకొంచెం కిలాడీ వేషాలు పెరిగాక ట్రంక్ రోడ్ లోన రీగల్ టైలర్స్ కి ఆటుమాయిన ఫిట్ టైలర్స్ కి మారింది. మోడరన్ స్టోర్స్ లో గుడ్డ కొనటం ఆడ్నించి నేరుగా టైలర్ షాప్ కి వెళ్ళటం. ఆస్థాన వైద్యుల మాదిరి ఆస్థాన టైలర్స్ వుండే వాళ్ళు మనకి ఆరోజుల్లో, కానీ ఇప్పుడు అంత రెడీ మేడ్ మేళం, ఆ హ్యూమన్ టచ్ పొయ్యిందబ్బా.
గుడ్డలంటే గుర్తుకొచ్చింది మా సమయంలో బొంబాయి పాలస్, రాయవరపు శంకరయ్య అండ్ సన్స్, బెనారస్ హాల్, అమాయిన మా అమ్మ అక్కలు గంటలు గంటలు నన్ను కూర్చోబెట్టి, కొన్న చీరలకి మాచింగ్ బ్లౌజ్ లు కొనే కలర్ కాంప్లెక్స్.
మన ఖాదీ అని ఖాదీ భండారుకి కూడా ఎక్కువ వెళ్లే టోల్లం. దానికి ఎదురుంగా వుండే సిటీ మెడికల్స్ అప్పట్లో చాలా ప్రసిద్ధి, అలాగే నాలుగడుగులు వేస్తే వచ్చే బాబా స్పోర్ట్స్, మా బాడ్మింటన్ బ్యాట్స్ గెట్స్ తో అల్లి వచ్చేవి కాదు అప్పట్లో, బాట్ కొని గెట్స్ అల్లించుకొనేవాళ్ళము ఓపికగా.
ఇంకా కో-ఆపరేటివ్ బ్యాంకు కి చుట్టూ వుండే మన సండే మార్కెట్ లో అప్పట్లో దొరకని వస్తువు ఉండేది కాదు.
మేము ఇంజనీరింగ్ లోకి రాంగానే మొదట కొన్న కాసియో ఎఫ్ ఎక్స్ 100 కాలిక్యులేటర్ మన శ్రీ రామా కి ఎదురు మిద్దె మీద వుండే, అప్పట్లో మేము ముచ్చట గా చెప్పుకొనే, స్మగుల్డ్ గూడ్స్ షాప్ లో.
నేను ఇంజనీరింగ్ రెండవ సంవత్సరంలో ఉండంగా అనుకుంటా, రాజీవ్ గాంధీ పోయాడని కొంత మంది తుంపుల మారోళ్ళు, సండే మార్కెట్ లోని షాప్స్ ని తగల పెట్టటం బాగా బాధ పెట్టె విషయం.
అట్టాగే చిన్నప్పుడు మద్రాసులో తెలుగు సినిమాలు తీసే రోజుల్లో , మొదటాటకి మద్రాస్ నించి చూడ్డానికి సినిమా వాళ్లంతా వచ్చేటోళ్లు , మన వూరికి హిట్టా ఫట్టా తేల్చుకోడానికి. అంటే మన నెల్లూరోళ్లే చెప్పాలి, మొదటాట చూసి ఆ సినిమా విషయం ఏందో.
ఆకాడికొస్తే అసలు చిరంజీవిని మెగాస్టార్ చేసిందే మనం.
ఎవరో గుర్తు చేశారు ఏమబ్బా హర్షా! నువ్వు ఆమె రాత్రులు లాటి మళయాళ సినిమాలు చూడలేదా, మనూర్లో అవెక్కడ ఆడతాయో మర్చిపోయినట్టు రాయకుండా పెద్ద మంచోడిలా పోజ్ కొడుతున్నవే అన్నారు.
నేను అసలు సిసలు నెల్లూరోడిని సామీ, ఆ వెంకటేశ్వర హాల్ వైభవాన్ని ఎలా మరిచిపోతాను. మా అనీల్గాడు వాళ్ళకి ఆ హాలోళ్లు తెల్సు గాబట్టి, ఎప్పుడెళ్ళిన, మా ఇద్దరిక
This podcast uses the following third-party services for analysis:
Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
Chartable - https://chartable.com/privacy