Shownotes
నేను నాలుగు చక్రాల వాహనం తోలటాన్ని దక్షిణాఫ్రికాలో నేర్చుకున్నా. చాలా పద్దతి గా నేర్పించారు. తోలేటప్పుడు సైడ్ వ్యూ మిర్రర్ లు, రియర్ వ్యూ మిర్రర్ లు పదే పదే చూడటం ఆ శిక్షణలో ఎక్కువ భాగం. సరే తోలడానికి అన్నీ అనుమతులు రావటంతో సుప్రియాని వాహనంలో ఎక్కించుకొని హుషారుగా, షికారుకు బయలుదేరాను. ట్రాఫిక్ వున్నా స్మూత్ గా కదులుతుంది ప్రయాణం, వెనక, ముందూ, పక్కల చూసుకుంటూ వెళ్తున్నా, ఎంతైనా కొత్త కదా. ఇంతలో సుప్రియ రియర్ వ్యూ మిర్రర్ ని సర్రుమంటూ తన వైపుకు తిప్పుకొని, తన చేతి సంచిలోంచి తన పెదవుల సౌందర్యాన్ని ఇనుమడింప చేసే సాధనాన్ని తీసి సౌందర్యాలంకరణ లో మునిగి పోయింది. నాకు వెనకేమి వస్తున్నాయో తెలియక కెవ్వు కెవ్వుమని అరుస్తున్నా. తాను చాలా ప్రశాంతంగా అబ్బాయా! అద్దముండేది ఎందుకు ముఖం చూసుకోవడానికి కాకపోతే. ఇందాకటి నుండి నువ్వా అద్దంలో నీ సోకు చూసుకుంటా ఉండావనుకుంటూ వున్నా అని తన సునిశిత దృష్టిని బయటపెట్టింది.
ఈ విషయం నేను ఈ మధ్య మా స్నేహితులందరి మధ్యలో ఉండగా బయట పెట్టా.. తాను ఎర్రబడ్డ మొహంతో, ఈడు మరీ అతిశయాలు కలిపి చెబుతున్నాడు, నేను ఆ అద్దం లాగింది పార్కింగ్ లాట్ లో ఉండగా అని కవర్ చేసేసింది. ఏది ఏమైనా ఈ ప్రాబ్లెమ్ నాలాటి అభాగ్యులు చాలామందికి జరిగిందేమో ఇంతకు ముందు, అందుకే పాసెంజర్ సైడ్ ఇంత లావు అక్షరాలతో వానిటీ మిర్రర్ ఏర్పాటు చేశారేమో. మీరెప్పుడైనా మాలాటి ఎర్ర బస్సు జంటలను చూసారా. చూసుంటే ఆ కథలు రాసెయ్యండి.
This podcast uses the following third-party services for analysis:
Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
Chartable - https://chartable.com/privacy