చేతి లో ఒక చిన్న బాగు తో, నా రూం బయట, కుర్చీలో కూర్చుని వెయిట్ చేస్తున్నాడాయన.
అరవై ఐదు ఏళ్ళు ఉంటాయి.
ఆయన్ని చివరి సారి నేను చూసింది నేను 10th క్లాస్ లో వున్నప్పుడు, ఇదే వూర్లో .
నా ముందున్న ఫైల్ మీద రాసుంది ఆయన పేరు, సంజీవరావు అని.
కావాలని ఒక రెండు గంటలనించి ఆయనని, నా గురించి వెయిట్ చేయిస్తున్నా.
నవంబర్ నెల కావడంతో, పెన్షన్ తీసుకొనే సీనియర్ సిటిజన్స్, "లైఫ్ సర్టిఫికెట్' కోసం మా ఆఫీస్ కి వస్తారు, ఫిసికల్ వెరిఫికేషన్ గురించి.
వాళ్ళ ఐడెంటిటీ వెరిఫై చేసి మేం సర్టిఫై చేస్తేనే, పెన్షన్ కంటిన్యూ అవుతుంది.
నేను కూడా, అంతకు ముందు నెలలోనే, ట్రాన్స్ఫర్ అయ్యి వరంగల్ ఆఫీస్ లో జాయిన్ అయ్యాను. మా ఫాదర్ కూడా ఇదే వూర్లో నా స్కూల్ డేస్ లో ఓ ఐదేళ్లు పని చేయడంతో, నాకు చాలా మెమోరీస్ ఉన్నాయి ఈ వూర్లో.
ఇంతలో, మా ఫ్రంట్ ఆఫీస్ క్లర్కు, గఫార్ లోపలికొచ్చాడు ,
"సార్ చాలా సేపటినించి వెయిట్ చేస్తున్నాడు సార్, ఆ పెద్దాయన మీకోసం, లోపలికి పిలవమంటారా ?" అన్నాడు, కొంచెం ఆదుర్దాగా.
"సరే రమ్మను," అన్నాన్నేను.
ఓ రెండు నిమిషాల తర్వాత, సంజీవరావు వచ్చి, నా ఎదురుగా వున్న, కుర్చీలో కూర్చున్నాడు.
ఓ ఐదు నిమిషాలు ఆయన ఫైలు అటూ ఇటూ తిప్పి, అక్కడే నిలబడి వున్న మా గఫార్ మొహం లోకి చూస్తూ చెప్పాను.
"మా రికార్డ్స్ లో వుండే మీ పేరు, మీ అప్లికేషన్ లో మీరు రాసిన మీ పేరు, స్పెల్లింగ్ మ్యాచ్ కావట్లేదు."
సంజీవరావు ఆందోళనగా అన్నాడు, "అదే విషయం నాకూ అర్థం కావట్లేదండి, పదేళ్లనించి ప్రతీ సంవత్సరం ఇదే ఆఫీస్ లో సర్టిఫై చేయిచుకుంటున్నాను. ఇప్పుడు మీరే ఎదో ఒక పద్ధతి ఆలోచించండి, ఇప్పుడు పెన్షన్ ఆగిపోతే నాకు చాలా ఇబ్బంది అవుతుంది. వేరే ఆధారం ఏం లేదు ."
"ఆలోచిస్తాను, కానీ, రెండు వారాలు పడ్తుంది. వర్క్ చాలా హెవీ గా వుంది " అన్నాన్నేను, ఫర్మ్ గా.
"మీరు అలా అంటే నేనేమీ చెప్పలేనండి. కానీ, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు, నా ప్రాబ్లెమ్ సాల్వ్ కాకపోతే, మీ ఆఫీస్ నించి కదిలి వెళ్లే పరిస్థితి మటుకు ఉండదు నాకు" అంటూ కుర్చీ లోంచి లేచి డోర్ వైపు అడుగులేసాడు సంజీవ రావు .
డోర్ దాకా వెళ్లి, ఒక్క క్షణం ఆగి, వెనక్కి తిరిగి అన్నాడు సంజీవ రావు నన్ను పరిశీలనగా చూస్తూ, " మిమ్మల్ని ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టుంది" అని.
"ఆ అవకాశం లేదు. నాకు ఇక్కడి ట్రాన్స్ఫర్ అయ్యి నెల మాత్రమే అయ్యింది" అన్నాను నేను పొడి పొడి గా.
తన బెల్టు సరి చేసుకుంటూ, రూమ్ బయటకి వెళ్ళిపోయాడు సంజీవ రావు.
గఫార్ కూడా, నా మొహంలోకి అదోలా చూసి, రూమ్ నించి బయటకు వెళ్ళిపోయాడు, తన సీటు దగ్గరికి.
సంజీవరావు ఫైల్ వైపే చూస్తూ ఓ ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాను.
సంజీవరావు, మా పక్కింట్లోనే ఉండేవాడు, మా ఫామిలీ ఇరవై ఏళ్ళక్రితం ఇదే వరంగల్ లో ఉండేటప్పుడు. ఆజన్మ బ్రహ్మచారి. మా కాలనీ లో ఆయనికి ఓ పెద్ద చాదస్తుడు అనే పేరు ఉండేది. ఆయన తమ్ముడే విజయ్.
మా స్నేహితులందరం ప్రేమగా పిల్చుకునే విజ్జన్న, సంజీవ రావు కంటే విజ్జన్న ఓ పదిహేనేళ్లు చిన్న.
హైదరాబాద్ లో నిజాం కాలేజీ లో చదివే వాడు విజ్జన్న. సెలవలకి విజ్జన్న వరంగల్ వొస్తే, మా పిల్లలందరికి పండగే పండగ. మా పిల్లలందరికీ విజ్జన్న అంటే ఒక పెద్ద హీరో. ఇది గాక, మా విజ్జన్న కి ఎందుకో నేనంటే విపరీతమైన ఇష్టం. నన్నూ, నా ఫ్రెండ్స్ నీ, తెగ సినిమాలకి, షికార్లకి తిప్పేవాడు వూర్లో వున్నన్ని రోజులూ.
కానీ ఇంత సరదాగా వుండే మా విజ్జన్నకీ, సంజీవరావు కీ ఎప్పుడు పడేది కాదు. ఆ రోజు నాకు బాగా గుర్తు. మా నాన్న కి విజయవాడ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చిన రోజు.
మా విజ్జన్న, హైదరాబాద్ నించి పూలదండలతో సహా, ఒక అమ్మాయి తో సంజీవ రావు గారింట్లో దిగి పొయ్యేడు.
ఇంక రామ రావణ యుద్ధం, ఫైనల్ గా, పక్క రోజు పొద్దున్నే, విజ్జన్నను కొత్త పెళ్ళాం తో సహా, ఇంట్లో నించి బయటకి పంపించాడు వాళ్లన్న, సంజీవ రావు గారు, కాలనీ లో ఎవ్వరు చెప్పినా వినిపించుకో
This podcast uses the following third-party services for analysis: