Artwork for podcast Harshaneeyam
ఆఫీసు పని ఇంట్లో చేస్తున్నారంటే!
28th March 2020 • Harshaneeyam • Harshaneeyam
00:00:00 00:01:36

Share Episode

Shownotes

మిస్ వైజ్ మా పెద్ద పాప అమృత క్లాస్ టీచర్, సీటెల్ లో వున్నప్పుడు. పేరెంట్స్ టీచర్ మీటింగ్ లో కలిసాము ఆవిడని, అకడమిక్ ఇయర్ మొదటలో . "నేను కావాలనే ఒక క్లాస్ పీరియడ్ కి, ఇంకో పీరియడ్ కి మధ్యలో పదిహేను నుండి ఇరవై నిముషాలు గ్యాప్ ఇచ్చాను. స్టూడెంట్స్ ఆ గ్యాప్ లో నేను ఇచ్చిన వర్క్ చేసుకోవచ్చు లేక పోతే వాళ్ళు వేరే ఆక్టివిటీస్ చేసుకోవచ్చు. నేను వాళ్ళను కంపెల్ చెయ్యను. కానీ వాళ్ళు ఇంటికొచ్చాక ఎక్కువ క్లాస్ వర్క్ చేస్తుంటే, వాళ్ళు నేను ఇచ్చిన గ్యాప్ లో వర్క్ చేయటం లేదు అని అర్థం. సో అమృతని కొంత కాలం మానిటర్ చేయండి. తనకి ఈ విషయం చెప్పకుండా", అని చెప్పారు ఆవిడ.

నేను అమృతని మానిటర్ చేయటం మొదలెట్టాను. ఆశించినట్టే మా అమృత వర్క్ నంతా ఇంటికి తెచ్చుకోవటం, నన్ను డౌట్స్ అడగటం మొదలెట్టింది. ఆలా చాలా రోజులు గడిచాయి, మా అమృత లో ఏమి మార్పు లేదు. ఒక రోజు తనకి చెప్పా, ఇలా నువ్వు ఇంట్లో స్కూల్ వర్క్ చేస్తున్నావంటే నువ్వు స్కూల్ లో అస్సలకే ఏమీ చేయకుండా టైం పాస్ చేస్తున్నావని అర్థం అని .

మా చిన్నది వాళ్ళ అక్క చుట్టూ తిరుగుతుంటుంది, వాళ్ళక్క ఇంట్లో ఉన్నంత వరకు. మా సంభాషణ అంత వింటూ వుంది. దానికి నాలుగు ఏళ్ళు నిండుతున్నాయనుకుంటా అప్పటికి. అది వెంటనే నా దగ్గర కు వచ్చి, నడుము మీద చేతులు వేసుకొని చెప్పింది, "ఓ, అయితే నాకు ఇప్పుడు అర్థమయ్యింది నువ్వు ఎందుకు ఆఫీస్ పని ఎప్పుడు ఇంట్లో చేస్తుంటావో" అని. నాకు అది పెద్ద షాక్. ఆ తర్వాత నేను ఆఫీస్ పని ఇంటికి తేలేదు . దానికి రోజూ చెప్పే వాడిని ఈ రోజు ఆఫీస్ పని ఆఫీస్ లోనే చేసేసా .



This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Chapters

Video

More from YouTube