మా సూరిని తీసుకు రావటం, వాడిని రీహాబిలిటేషన్ సెంటర్ లో చేర్చటం మరియు వాడు కూడా బుద్ధిగా చికిత్సకు సహకరిస్తూ వుండడటంతో మా మిత్రబృందపు ఆత్మ విశ్వాసం ఇనుమడించింది, మనము కూడా అనుకున్నపనులు అనుకున్నట్టుగా సాధించగలం అని.
ఈ లోపల మాతో వాకాటిలో చదివిన ఇంకో మిత్రుని అమ్మగారికి శస్త్ర చికిత్స అవసరం అయ్యింది, మా వాడు కూడా ఉద్యోగం మారే సంధికాలంలో ఉండటంతో ఇన్సూరెన్స్ ద్వారా అందవలసిన సహాయం అందక పోవటముతో ఇబ్బందుల్లో పడిపోయాడు. ఈ విషయం తెలిసిన మా ప్రశాంత్ గాడు స్పందించి మా అనీల్గాడిని కార్యరంగంలోకి దిగమని ఆజ్ఞాపించటం, మరియు మా వాడు మా వాళ్ళందరినీ కదిలించటంతో ఒక వారం లోపే చికిత్సకు కావలసిన రమారమి ఓ పది లక్షలు, ఇంక వొద్దురా నాయనా చాలు ప్రస్తుతానికి అనే దాకా మా వాళ్ళు చక చక సర్దేసారు.
ఇటువంటి అసంకల్పిత ప్రతీకార చర్యలాగా అందిన సహాయం మా వాళ్ళ ఉత్సాహాన్ని ద్విగుణీకృతం చేసింది, అవును అవసరాలలో వున్న మన స్నేహితులనందరినీ ఆదుకోవోచ్చు అని. దానితో పాటు ఎన్నో ఆలోచనలు, వనరులు ఎలా సమకూర్చుకోవాలి, ఏమేమి ప్రాధమిక అవసరాలు పరిగణలోకి తీసుకోవాలి, కేవలం స్నేహితుల ఆరోగ్య సమస్యలేనా, లేక కుటుంబ సభ్యుల ఆరోగ్యాలు కూడానా, లేక పిల్లల చదువులు కూడా పరిగణించాలా, బదులు తీర్చే నిబంధన తోనా లేక గ్రాంట్ రూపం లోనా, ఇటువంటివి అన్నిటికీ ఒక రూపం రావాలంటే ఒక కార్యనిర్వాహక బృందం ఏర్పడాలి అని నిశ్చయించారు.
ఈ లోపల మా కాలేజీతో సంబంధ బాంధవ్యాలు నెరుపుతున్న మిత్రులకి మా కాలేజీ తరపున మా బృందం కాలేజీని వొదలి ఇరవై ఐదేళ్లు అయిన సందర్భముగా జరపబోయే రజతోత్సవానికి రమ్మని ఆహ్వానము అందినది. ఈ ఆహ్వానాన్ని అందిపుచ్చు కొని వీలు అయినంత మందిమి కలవాలని నిశ్చయించారు. మా ముందు బ్యాచ్ వాళ్ళు ఒక ఎనభై మంది వరకు అట్టి సమ్మేళనంలో కలిసారని మా సీనియర్ అయిన బాలాజీ ద్వారా తెలియటం తో మేము కనీసం ఒక నూట ఏభై మందిమైనా కలిసి మా బ్యాచ్ యొక్క ప్రత్యేకతని నిలబెట్టుకోవాలని తీర్మానం చేసేశాము.
వీటి ఏర్పాట్లు పర్యవేక్షించడానికి అందరం ఒక మూడు నెలల ముందే మా నారాయణగాడి నిర్మాణ సంస్థలో వాడి కార్యాలయం లో ప్రతి రెండు ఆదివారాలొకొక సారి సమావేశాలు నడపాలని నిశ్చయించారు. అలా సమావేశానికి వచ్చిన వారికి మా నారాయణుడు ఇడ్లీలు, పొంగలి, వడలు, అటుపిమ్మట ఓ మంచి కాఫీ తో సత్కరించాలని హుకుం జారీ అయిపోయాయి. అలా మొదలైన మా సమావేశాలకి మా ఎన్.ఆర్.ఐ మిత్రులు వీడియో కాల్ లో కలిసేవారు.
రజతోత్సవం రోజున మా కాలేజీ లో కలిసి, సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాలలో పాల్గొని, అటు పిమ్మట ఆ సాయంత్రానికి తిరుపతి చేరుకొని, ఆ రాతిరి మరియు మరుసటి రోజంతా మా సంబురాలు జరుపుకొని అటుపిమ్మట మరలా ఎవరి మానాన వాళ్ళం వాళ్ళ వాళ్ళ ఊర్లకు చేరుకునేలా పథకం వేసేశాము. ఈ పథకాన్ని చిన్న చిన్న పనులుగా విభజించి, ఒక్కో పనికి ఒక్కొరిని బాధ్యుల్ని చేసి ఆ పనులు ఎలా సాగుతున్నాయి చూడడానికి రెండువారాలకొకసారి సమావేశం అయ్యేవాళ్ళము.
వీలైనంత మంది స్నేహితులను ఈ సమ్మేళన సందర్భంగా వచ్చేలా చూసే బాధ్యత మా అనీల్గాడు నెత్తికెత్తుకున్నాడు. ఆ కార్యక్రం అయ్యేదాకా నిద్రాహారాలు మాని ఒక పూనకం వచ్చిన వాడిలా పని చేశాడు. వాడు ఒక్కో స్నేహితుడిని ఎలా కనుగొన్నాడో రాయాలంటే ఓ పెద్ద గ్రంథమే అవుతుంది కానీ మచ్చుకు కొన్ని రాసి వాడి పరిశోధనా భరితమైన బుర్రని గురించి తెలియజేయాలి అని అనుకుంటున్నా.
అసిఫ్ అహ్మద్ మా సహాధ్యాయి మరియు మా అనీల్గాడికి ల్యాబ్ మేట్. అట్టి ఆసిఫ్ ని మావాడు చివరిసారిగా కలిసింది 1994 లో మరియు హైదరాబాదు నగరంలో. అటు పిమ్మట వారిద్దరి మధ్య సమాచార వారధి తెగిపోయింది. మావాడు ముందుగా ఆసిఫ్ ని వెతకటం లో పడ్డాడు, ముందుగా మా కాలేజీలో లోనే ప్రొఫెసర్ గా పనిచేస్తున్న మా స్నేహితుడైన మోహనయ్య ద్వారా అసిఫ్ అడ
This podcast uses the following third-party services for analysis:
Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
Chartable - https://chartable.com/privacy